Thursday, 15 March 2012

టెంక మిగిలింది...

మనసుని సాంతం నాకేసి....
ఇప్పుడొద్దని మొహాన కొట్టింది...టేస్ట్ లేదు!!!
..."చైతన్య"

చావుప్రేమ!

ప్రేమకోసం చేయి చాచా...
మృత్యువొచ్చి హత్తుకుంది!!!
...."చైతన్య"

శబరెంగిలి

ఈ ముద్ద నా ఆకలి తీర్చింది...
తినకుండా పడేసిన దేవుడికి దణ్ణాలు!!!
..."చైతన్య"


Monday, 12 March 2012

మనసనాధ

ఎవరి దారిన వారెల్లారు...
మనసులే ఇప్పుడు అనాధలయ్యాయి!!!

........"చైతన్య"

Wednesday, 22 February 2012

Top Ten Femtos (23 FEB 2012)


పిచ్చిమనసు!

పాపం ఎవరిదో ఈ మనసు!
తీసుకున్నట్లే తీసుకొని పడేసారు...
....."చైతన్య"

Tuesday, 21 February 2012

అందుకేనేమో...

ఇక్కడ మనుషుల్లేరు! మనసులే కనబడుతున్నాయ్...
ప్రేమలోకం కాబోలు!!!
....."
చైతన్య"

షరత్తు!

నే....కోల్పోయిన సంతోషం తిరిగొస్తానంది!
మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చాకనే నన్న షరత్తుతో...
........"
చైతన్య"

నాకొద్దుపో...

పదిలంగా చూసుకుంటావని ఇచ్చా...
కానీ మనసంతా చిందరవందరే!!!

...."చైతన్య"

Monday, 20 February 2012

బ్రతికే ఉన్నానా!!!

నమ్మకద్రోహం,నయవంచన..
చంపేసావ్?
బ్రతికుండగానే!

......."చైతన్య"

రెప్పపాటు ప్రేమ!

నీకోసం యుగాలు వేచాను...
ప్చ్.. క్షణాలలోనే నను దాటెల్లిపోయావు!!!
....."చైతన్య"

Saturday, 11 February 2012

నిరీక్షణ

నాన్నిచ్చే  డైరీకి...
ఏడాది  ఎదురుచూపు?
........"చైతన్య"

ఎవరిదిది?

రాత మారిందేంటి!
ఎవరిదీ డైరీ?
....."చైతన్య"

మార్పులేదు!

చేజిక్కిన నీ తలవెంట్రుక...
నా డైరీలో మెరుస్తూనేవుంది!
......"చైతన్య"

 

Friday, 10 February 2012

జ్ఞాపకాల పూదోట!

డైరీలో పరిమళాలు!!!
వాడిపోని  జ్ఞాపకాలవి...
......"చైతన్య"

నిను చూస్తూనేవున్నా....


కానరాని నిన్ను!
డైరీలో చూస్తున్నా..
......."చైతన్య"

Silence Please...


గుండె పగిలింది.. 
నిశ్శబ్దంగానే...
....."నరేష్ కుమార్"

Thursday, 9 February 2012

అవును ఇది నిజం!

నీపై నా ప్రేమను..
తొలిసారి చెప్పింది  డైరీకే!
......."చైతన్య"

 

C/O

డైరీ నాదే,కానీ
ప్రతిపేజీ నీదే!!
....."చైతన్య"

నువ్వే చెప్పు?

ప్రేమ తోటలో దారి
తప్పిపోయా .. !!బయట కెలా వెళ్ళేది ?
....."మెర్సీ మార్గరెట్"