Saturday, 21 April 2012

చచ్చాన్రోయ్!


నిన్నే పిల్చేది...
తనువుని వీడినా నిన్ను వీడలేకున్నా...

..."చైతన్య"

కళ్ళను మోసంచేయ్!


రేపటే వస్తా...బాధల్లో వున్నా-
బయటపడకు! నా అహం చూస్తే నవ్వుద్ది!
..."చైతన్య"

ఏంటండీ మరీనూ...


ఎవ్వరు చూస్తే మనకేం!
పెళ్ళి మనకీ స్వేచ్చనిచ్చింది.
..."చైతన్య"

ఓటమి హితవు!

ఓటమి నాతో ఓ మాటంది!
నాతో ఉంటే నువ్వూ లోకువే- గెలుపుతో చేరు!
..."చైతన్య"

మనోపుష్పం...


కన్నుల్లో పరిమళాలేంటి?
ఓహ్..మనసు పుష్పించిందా!!!
....."చైతన్య"

Friday, 20 April 2012

నిశ్శబ్దాన్ని వెలివేయి!


రేపటి వరకూ ఎందుకు?
ఇప్పుడే వెళ్ళు మళ్ళీ ఈ నిశ్శబ్దం ఎందుకు???
...."చైతన్య"

కాస్త పుణ్యం కట్టుకుపో..


రేపో సారి వచ్చిపో...
నిన్నటి నా చితికి నిప్పు పెట్టేందుకు!
...."చైతన్య"

మనసంతా నువ్వే!

మోము త్రిప్పి!
మనసుతో మాట్లాడతావేం...
....."చైతన్య"

తడారిన ప్రేమ!

వాడని పువ్వు!


పలకరించిన ప్రతిసారీ...
విచ్చుకున్న పువ్వునే నేను!
....."చైతన్య"

ఎంతెంత దూరం!


నేను దూరంగా వెళ్ళట్లేదు!
నీకు మరింత దగ్గరౌతున్న.....మొద్దూ!!!
....."చైతన్య"

Thursday, 19 April 2012

సీతాకోకటీగ!


తేనెటీగవేనా!
సీతాకోకచిలకవనుకున్నా...
......."అరుణ్ రాజం"

హకూనమట్టాట!


ప్రేమ బావిలో కప్పనౌతా...
నీళ్ళున్నా...లేకున్నా....
......."అరుణ్ రాజం"

చీకటి మజిలీ!


నా చుట్టంతా గాడాంధకారమే...
నీ ప్రేమ స్మృతుల కిరణాలు తప్ప!
....."సుందర్ ప్రియా"


నయనాల దాహం!

కంటి కి దాహం వేస్తోంది!
కాస్త కనబడి కనికరించవూ ...

....."వల్లీ దేవసేన"

మంచు దుప్పటి!

విషాదం హిమ వర్షం అయితే...
నీ జ్ఞాపకం చలి మంట గా మారింది!
......."దేచిరాజు మాలతి"


Wednesday, 18 April 2012

తొతొతొతొతొతొలిప్రేమ!

కొంత అస్పష్టత!
 ఎంతో ఉత్సాహం! తొలి ప్రేమ ...
......."చంద్రశేఖర్ వేములపల్లి"

చెత్తకుప్ప ఏడుస్తుంది!

కన్న ప్రేమ తరిమేస్తుంటే
చెత్త కుప్పలు తల్లులు అవుతున్నాయి
........."అనిల్ డ్యాని"


నేనింతే!

నీ జ్ఞాపకాల పూదోటలో ...
నా ఆనందాల నాట్య విహారం
........."అనిల్ డ్యాని"

Saturday, 14 April 2012

F E M T O of The DAY(13-04-2012)


************** F E M T O of The DAY ******************
************** (13-04-2012) *********************

EVERGREEN F E M T O of The DAY
-------------------------------------
క్షణక్షణం రిఫ్రెష్ అవుతూ
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!
........"Chandrasekhar Vemulapally"


Love F E M T O of The DAY

-----------------------------
హృదయం రెక్కలు విచ్చుకుంది!!
ఏ గుండె గూటికి చేరడానికో??
........."Sireesha Sribhashyam"


CONTEMPLATIVE F E M T O of The DAY
-----------------------------------------
ముళ్ళలో పడ్డ మల్లెపువ్వు ..
కట్నం ఇవ్వలేదట
.............."Mercy Margaret"


FEMINIST F E M T O of The DAY
--------------------------------------
ఏడడుగుల ఆశ చూపి
తప్పటడుగేయించి తల్లిని చేసిపోతారు...
....."Vineel Kanthi Kumar"

SPECIAL F E M T O of The DAY
------------------------------------
అడిగింది రూపాయేగా
అసహ్యాన్నేశావేంటి బాబయ్యా?
........."Vineel Kanthi Kumar"

అబద్దం ఆడావు అనికాదు!
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని ..
. ......."Chandrasekhar Vemulapally"

సత్యం కలలాంటిది ..
గిల్లుకొని confirm చేస్కుంటావ్ !!!
.........."Shri Kanth"


*************** C O N G R A T U L A T I O N S *****************

Friday, 13 April 2012

12-04-2012 F E M T O of The DAY


************** F E M T O of The DAY ******************
************** (12-04-2012) *********************

EVERGREEN F E M T O of The DAY
-------------------------------------
కాళ్ళు విరిగాయా పర్లేదు
కుంటుతూ అయిన గమ్యం చేరు ..............."Mercy Margaret"


Love F E M T O of The DAY
-----------------------------
మన ప్రేమలో...,
నాకెన్నిమరణాలు...? నీకెన్ని జననాలు....? .........."Naresh Kumar"


CONTEMPLATIVE F E M T O of The DAY
-----------------------------------------
'ధర్మపత్నీసమేత'
ఆమెకు ఉనికేలేదు ఇంకపేరెందుకులే! .............."Naveen Rjy"

FUNNY F E M T O of The DAY
------------------------------------
అసలే అంతంతమాత్రం
ఇపుడు 'జ్ఞాన'దంతాన్ని కూడా పీకేశారు... .............."Naveen Rjy"

FEMINIST F E M T O of The DAY
--------------------------------------
ఆమె - ఏడుస్తూ చల్లబడుతుంది ..."Naveen Rjy"

SPECIAL F E M T O of The DAY
------------------------------------
కమ్మినాయి నల్లని మేఘాలు
మెరుపుకై చూడనా...వెలుగుకై వెతుకాడనా!!! ..........."Jagannadh Velidimalla"

*************** C O N G R A T U L A T I O N S *****************