Friday, 17 January 2014

పదిలంగా....


హృదయపు ఆల్చిప్ప లో
పదిలంగా......కంటిని ముద్దాడని కన్నీళ్ళవి!!!!
............"చైతన్య"


Wednesday, 3 April 2013

జ్ఞాపకాల సంద్రంలో....

తడి ఆరని నీ జ్ఞాపకం!
ప్రతిక్షణం నా మదిని తడుముతూనే ఉంది..
........"వర్ణలేఖ"


Wednesday, 27 February 2013

మనదీ ఒక బ్రతుకేనా??

"స్వేఛ్చ"...!
అలాగే ఉంది..!..ఎవరికీ దొరక్కుండా..!

............"చాంద్ ఉస్మాన్"

అ(ద్దం)డ్డం!

అద్దం అడ్డంగా ఉంది ...
నన్ను నేను చూసుకోనీకుండా !
............"అనురాధ"

Tuesday, 12 February 2013

Where ever u go .. Her Network Follows... ;)

చితికిన మనసుని సైతం...
బ్రతకనీయదు నీ స్మృతుల ఉదృతి..
............"మీ అన్వేషి"


Wednesday, 5 December 2012

ఏం తల్లీ ఇంకో లడ్డూ కావాలా!!!

నీ ప్రేమ ద్రోహానికి..
నాలో మిగిలిన చివరి చిరునవ్వు ఇచ్చా!!!
........"శ్రీకాంత్"

పనిలేక!

పిచ్చి పవర్ ఆఫ్ ఇన్‌ఫినిటీ ఈజ్ ఈక్వల్ టూ...!

చేతి గోరులా నన్ను ...
రంగులేస్తూ, ప్రేమిస్తూ, కత్తిరిస్తూ ... చిత్రంగా!
.........."చంద్రశేఖర్ వేములపల్లి"

Tuesday, 4 December 2012

తెల్లారినట్టే ఉంది!

చిరునవ్వు విసిరావు....
అందటానికి జీవితకాలం పట్టింది!!!
........."నీలిమ మాకినేని"

విశ్వదాభి రామ వినురవేమ!

మాసినగుడ్డ ఈ రాజకీయం...
చిల్లుపడుతుందేమో కానీ తెల్లబడదు!!!
........."కోదండ రావు"

చివరి చరణం!

నల్లని మేఘాలు కమ్మాయి..
మెరుపుకై చూడనా!!! వెలుగుకై వెతుకాడనా!!!
......"విసురజ"


ఈమెకో పేరు పెట్టండి!


'ధర్మపత్నీసమేత'...
ఆమెకు ఉనికేలేదు ఇంక పేరెందుకులే!
....."Naveen Rjy"
 

ఈ అగ్నిపర్వతం ఎప్పటికీ బ్రద్దలవ్వదు!!

ఆమె - ఏడుస్తూ చల్లబడుతుంది !!!
........."Naveen Rjy"

Ctrl+N

కాళ్ళు విరిగాయా పర్లేదు!
కుంటుతూ అయినా గమ్యం చేరు.... 
....."మెర్సీ మార్గరెట్"

గ్రహణం!

అబద్దం ఆడావు అనికాదు..
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని!!!
......"చంద్రశేఖర్ వేములపల్లి"

F5

క్షణక్షణం రిఫ్రెష్ అవుతూ..
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!
...."చంద్రశేఖర్ వేములపల్లి"




Monday, 3 December 2012

బిస్కేట్!


కొన్ని కలల్నిచ్చి...
నా నిద్దురని దోచుకుంది!!!  
....."నరేష్ కుమార్"

ఇది! వెన్నెల రహస్యం...

గిల్లి పోతుంటే తన జ్ఞాపకం...
వెన్నెలవదా?? నా విరహం!!!    
....."మెర్సీ మార్గరెట్"

ఇప్పుడో చిన్న Break...

ఎందుకోస్తావో ఎందుకెళ్తావో!
మనసంతా జ్ఞాపకాల జల్లు కురిపిస్తావు....    
...."శ్లోకా శాస్త్రి"

 

ఎక్కడిదొంగలక్కడే గప్‌చుప్!

హ్మ్మ్ ! ఏంటో ఈ గాజులు!!!
 మన ఉనికిని అందరికి చాటుతూ ....
........"అనిల్ డ్యాని"