Wednesday, 5 December 2012

ఏం తల్లీ ఇంకో లడ్డూ కావాలా!!!

నీ ప్రేమ ద్రోహానికి..
నాలో మిగిలిన చివరి చిరునవ్వు ఇచ్చా!!!
........"శ్రీకాంత్"

పనిలేక!

పిచ్చి పవర్ ఆఫ్ ఇన్‌ఫినిటీ ఈజ్ ఈక్వల్ టూ...!

చేతి గోరులా నన్ను ...
రంగులేస్తూ, ప్రేమిస్తూ, కత్తిరిస్తూ ... చిత్రంగా!
.........."చంద్రశేఖర్ వేములపల్లి"

Tuesday, 4 December 2012

తెల్లారినట్టే ఉంది!

చిరునవ్వు విసిరావు....
అందటానికి జీవితకాలం పట్టింది!!!
........."నీలిమ మాకినేని"

విశ్వదాభి రామ వినురవేమ!

మాసినగుడ్డ ఈ రాజకీయం...
చిల్లుపడుతుందేమో కానీ తెల్లబడదు!!!
........."కోదండ రావు"

చివరి చరణం!

నల్లని మేఘాలు కమ్మాయి..
మెరుపుకై చూడనా!!! వెలుగుకై వెతుకాడనా!!!
......"విసురజ"


ఈమెకో పేరు పెట్టండి!


'ధర్మపత్నీసమేత'...
ఆమెకు ఉనికేలేదు ఇంక పేరెందుకులే!
....."Naveen Rjy"
 

ఈ అగ్నిపర్వతం ఎప్పటికీ బ్రద్దలవ్వదు!!

ఆమె - ఏడుస్తూ చల్లబడుతుంది !!!
........."Naveen Rjy"

Ctrl+N

కాళ్ళు విరిగాయా పర్లేదు!
కుంటుతూ అయినా గమ్యం చేరు.... 
....."మెర్సీ మార్గరెట్"

గ్రహణం!

అబద్దం ఆడావు అనికాదు..
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని!!!
......"చంద్రశేఖర్ వేములపల్లి"

F5

క్షణక్షణం రిఫ్రెష్ అవుతూ..
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!
...."చంద్రశేఖర్ వేములపల్లి"
Monday, 3 December 2012

బిస్కేట్!


కొన్ని కలల్నిచ్చి...
నా నిద్దురని దోచుకుంది!!!  
....."నరేష్ కుమార్"

ఇది! వెన్నెల రహస్యం...

గిల్లి పోతుంటే తన జ్ఞాపకం...
వెన్నెలవదా?? నా విరహం!!!    
....."మెర్సీ మార్గరెట్"

ఇప్పుడో చిన్న Break...

ఎందుకోస్తావో ఎందుకెళ్తావో!
మనసంతా జ్ఞాపకాల జల్లు కురిపిస్తావు....    
...."శ్లోకా శాస్త్రి"

 

ఎక్కడిదొంగలక్కడే గప్‌చుప్!

హ్మ్మ్ ! ఏంటో ఈ గాజులు!!!
 మన ఉనికిని అందరికి చాటుతూ ....
........"అనిల్ డ్యాని"

ఇదే రాగం???

హృదయవీణ తెగింది..
రాగాలన్నీ రక్తధారలై...!
......."రాజేష్ యల్లా"

ఇంత ప్రేముంటెయ్యమ్మో!

నీ కళ్ళు మరిగిన చొట!!!
ప్రేమ ఆకళ్ళు పెరుగుతున్నాయి...
......"క్రాంతి శ్రీనివాసరావు"

Sunday, 2 December 2012

ఒక ప్రశ్నకు ఇన్ని జవాబులా????

కొన్ని ప్రశ్నలకు సంకెళ్ళు!!!
మరి కొన్ని ప్రశ్నలకు ఎదురు కాల్పులు...
......"క్రాంతి శ్రీనివసరావు"

No Noice Only ♥!

నీ రాకతో మొదలైన-
ప్రేమకథ... నువ్వెళ్ళిపోయినా ఐపోదేంటీ?
....."నరేష్ కుమార్"

RAC

నిన్న నాతో, ఇవాళ తనతో..
ఏది బాగుంది, వీలైతే అబధ్దం చెప్పు!!!
........."వంశీధర్ రెడ్డి"

Saturday, 1 December 2012

కుర్రో.....కుర్రు!

గీతల్లో భవిష్యత్తా...!?మరి చేతుల్లేనొడికీ...!??
........."నరేష్ కుమార్"

ఇప్పుడన్నా వినండి!

మనసు తొణికినప్పుడు-
వొలికిన సిరాచుక్క చప్పుడు విందాం..."క్రాంతి శ్రీనివాసరావు"

ఎంతెంత దూరం!


నీకు - నాకు దూరం...
కనురెప్పలు మూసి తెరిచే కాలం!!!....."నీలిమ మాకినేని"

మా ఊర్లో ఇంతే!

నా నిశీధి లో ఉదయిస్తుంది...
నీ...... ఉషోదయం ప్రతీరోజు!!!!......"అనిల్ డ్యాని"

ఇంకొన్ని జ్ఞాపకాలనివ్వాల్సింది!!!

నా గుండె గదిలో....
అన్నీ నీ పాదముద్రలే!!!....."అనిల్ డ్యాని"