Wednesday 5 December 2012

ఏం తల్లీ ఇంకో లడ్డూ కావాలా!!!

నీ ప్రేమ ద్రోహానికి..
నాలో మిగిలిన చివరి చిరునవ్వు ఇచ్చా!!!
........"శ్రీకాంత్"

పనిలేక!

పిచ్చి పవర్ ఆఫ్ ఇన్‌ఫినిటీ ఈజ్ ఈక్వల్ టూ...!

చేతి గోరులా నన్ను ...
రంగులేస్తూ, ప్రేమిస్తూ, కత్తిరిస్తూ ... చిత్రంగా!
.........."చంద్రశేఖర్ వేములపల్లి"

Tuesday 4 December 2012

తెల్లారినట్టే ఉంది!

చిరునవ్వు విసిరావు....
అందటానికి జీవితకాలం పట్టింది!!!
........."నీలిమ మాకినేని"

విశ్వదాభి రామ వినురవేమ!

మాసినగుడ్డ ఈ రాజకీయం...
చిల్లుపడుతుందేమో కానీ తెల్లబడదు!!!
........."కోదండ రావు"

చివరి చరణం!

నల్లని మేఘాలు కమ్మాయి..
మెరుపుకై చూడనా!!! వెలుగుకై వెతుకాడనా!!!
......"విసురజ"


ఈమెకో పేరు పెట్టండి!


'ధర్మపత్నీసమేత'...
ఆమెకు ఉనికేలేదు ఇంక పేరెందుకులే!
....."Naveen Rjy"
 

ఈ అగ్నిపర్వతం ఎప్పటికీ బ్రద్దలవ్వదు!!

ఆమె - ఏడుస్తూ చల్లబడుతుంది !!!
........."Naveen Rjy"

Ctrl+N

కాళ్ళు విరిగాయా పర్లేదు!
కుంటుతూ అయినా గమ్యం చేరు.... 
....."మెర్సీ మార్గరెట్"

గ్రహణం!

అబద్దం ఆడావు అనికాదు..
ఈ క్షణం నుంచి నిన్ను నమ్మలేనే అని!!!
......"చంద్రశేఖర్ వేములపల్లి"

F5

క్షణక్షణం రిఫ్రెష్ అవుతూ..
రాయబడుతున్న రేపటి చరిత్రే జీవితం!
...."చంద్రశేఖర్ వేములపల్లి"




Monday 3 December 2012

బిస్కేట్!


కొన్ని కలల్నిచ్చి...
నా నిద్దురని దోచుకుంది!!!  
....."నరేష్ కుమార్"

ఇది! వెన్నెల రహస్యం...

గిల్లి పోతుంటే తన జ్ఞాపకం...
వెన్నెలవదా?? నా విరహం!!!    
....."మెర్సీ మార్గరెట్"

ఇప్పుడో చిన్న Break...

ఎందుకోస్తావో ఎందుకెళ్తావో!
మనసంతా జ్ఞాపకాల జల్లు కురిపిస్తావు....    
...."శ్లోకా శాస్త్రి"

 

ఎక్కడిదొంగలక్కడే గప్‌చుప్!

హ్మ్మ్ ! ఏంటో ఈ గాజులు!!!
 మన ఉనికిని అందరికి చాటుతూ ....
........"అనిల్ డ్యాని"

ఇదే రాగం???

హృదయవీణ తెగింది..
రాగాలన్నీ రక్తధారలై...!
......."రాజేష్ యల్లా"

ఇంత ప్రేముంటెయ్యమ్మో!

నీ కళ్ళు మరిగిన చొట!!!
ప్రేమ ఆకళ్ళు పెరుగుతున్నాయి...
......"క్రాంతి శ్రీనివాసరావు"

Sunday 2 December 2012

ఒక ప్రశ్నకు ఇన్ని జవాబులా????

కొన్ని ప్రశ్నలకు సంకెళ్ళు!!!
మరి కొన్ని ప్రశ్నలకు ఎదురు కాల్పులు...
......"క్రాంతి శ్రీనివసరావు"

No Noice Only ♥!

నీ రాకతో మొదలైన-
ప్రేమకథ... నువ్వెళ్ళిపోయినా ఐపోదేంటీ?
....."నరేష్ కుమార్"

RAC

నిన్న నాతో, ఇవాళ తనతో..
ఏది బాగుంది, వీలైతే అబధ్దం చెప్పు!!!
........."వంశీధర్ రెడ్డి"

Saturday 1 December 2012

కుర్రో.....కుర్రు!

గీతల్లో భవిష్యత్తా...!?మరి చేతుల్లేనొడికీ...!??
........."నరేష్ కుమార్"

ఇప్పుడన్నా వినండి!

మనసు తొణికినప్పుడు-
వొలికిన సిరాచుక్క చప్పుడు విందాం..."క్రాంతి శ్రీనివాసరావు"

ఎంతెంత దూరం!


నీకు - నాకు దూరం...
కనురెప్పలు మూసి తెరిచే కాలం!!!....."నీలిమ మాకినేని"

మా ఊర్లో ఇంతే!

నా నిశీధి లో ఉదయిస్తుంది...
నీ...... ఉషోదయం ప్రతీరోజు!!!!......"అనిల్ డ్యాని"

ఇంకొన్ని జ్ఞాపకాలనివ్వాల్సింది!!!

నా గుండె గదిలో....
అన్నీ నీ పాదముద్రలే!!!....."అనిల్ డ్యాని"

Sunday 30 September 2012

What an Idea Sir ji!

" ప్రేమ జ్వరంలో నోరు చేదైతే....
నీ తీపి జ్ఞాపకాల్నే  చప్పరిస్తున్నా !!! "
...."చైతన్య"

Thursday 27 September 2012

గుర్తుకొస్తున్నాయి...

"గురితప్పా నీవల్లే!!!!!!!"
...."మెర్సీ మార్గరెట్"

సమాధానం లేని ప్రశ్న!

"మన ప్రేమలో....
నాకెన్ని మరణాలు..?నీకెన్ని జననాలు..?"
....."నరేష్ కుమార్"

మాటే కానీ!!

"మాటలు పారబోయకు...
మనసు తడిస్తే, ఎండడం కష్టం!!"
........"Suresh Jajjara

Tuesday 25 September 2012

సశేషం...

జీవించాలని ఉంది ...
నీ జ్ఞాపకాలు సమాధి కాకుండా ఉంచాలని ..
........."Sharon Sandhi"


Saturday 22 September 2012

"మాయావి!"

గుప్పెడు పూలురేసుకున్నాయ్!!!
నీ జడలో తిరిగి ప్రాణం పోసుకునేందుకు....
........."నరేష్ కుమార్"

Wednesday 5 September 2012

నేనింతే!

నీతోపాటు నా చిరునవ్వుని-
కూడా తీసుకెళ్ళావు...అదిస్తావా....నువ్వొస్తావా? 
........."నీలిమా మాకినేని"

తూనీగా తూనీగ!

అబద్దమైతే బావున్ను!!

జారిపోతున్నా అగాధంలోకి ..
ఎందరివో ఆపన్నహస్తాలు.. ప్చ్!! నీవితప్ప !!........."అనురాధ

Tuesday 4 September 2012

ప్రయాణం

"నీ మదిలో ఇంకెన్ని...
మైలు రాళ్ళు దాటాలి నిన్ను చేరేందుకు !!!!"
...."చైతన్య"

Saturday 1 September 2012

ఎక్కడని వెతకను!

నా వల్ల కావట్లేదు,
నీవోదిలాక నన్ను చేరుకోవటం ...."నా పేరు శ్రీనివాస్".

నీ కోసమే...

కను రెప్పలు పట్టుకొని
వ్రేలాడుతూ నీ జ్ఞాపకం ..కదిలించి రాల్చకు ...."మెర్సీ మార్గరెట్"


Friday 22 June 2012

మదికి చెప్పొదనే ఈ రాజీ!
నువ్వికరావన్న నిజంతో లాలూచీపడి!
........"చైతన్య"

Wednesday 20 June 2012

చిరునవ్వుల నాట్యం!


నీ జ్ఞాపకాల పూదోటలో...
నిత్యం చిరునవ్వుల నాట్యమే నాది!  
....."చైతన్య"
 


మౌనమె నీ బాష!

మౌనానికి కారణాలెతక్కు...
ఎందుకంటే ఆ కారణాల్లో దొరికేది నువ్వే!
........."చైతన్య"


పెదవిటీగలు

మకరందం దాచావా...
పెదవిటీగలు పసిగట్టాయి!
........"చైతన్య"

వాడని పుష్పం..

ఇది నా హృదయం...
నీ జ్ఞాపకాల్లో ఎప్పటికి వాడని పువ్వే!
..........."చైతన్య"

తను..వింటే!

నీ తనువంతా చెవులేనా...
ప్రతి కదలికా వినాలని చేరువౌతుంది!
.........."చైతన్య"

ప్రే...........మ!

మన మధ్య శూన్యాన్ని పూరించేదే.. ప్రేమ!
........"చైతన్య"

దాటలేకే!

మాటల్ని మూటకట్టుకో...
మాటిమాటికీ అడ్డు తగుల్తున్నాయ్!
......."చైతన్య"

రుతురాగాలు...

రెప్పల మాటున మబ్బుల్ని...
నీటిఊటతో నింపుతూ, నువ్ లేక!
....."వంశీధర్ రెడ్డి"





Saturday 2 June 2012

కొంచెముండు!

అప్పుడే విడవమనకు...
నూరేళ్ళ సంతోషాన్ని నే హత్తుకుంది!
....."చైతన్య"

కన్నీటి ప్రశ్నలు!

కన్నీరంటే కోపమే!
కన్నీటి ప్రశ్నలకు సమాధానాల్లేవుగా...
....."చైతన్య"

ఒంటరిగా వదలవుగా!

ఒంటరిగా ఉన్నాగా...
రెక్కలు కట్టుకొస్తాయి రంగుల జ్ఞాపకాలు!!
....."చైతన్య"

ఒంటరితనాన్న కోరింది!


ఓ ఆశను నా చేతికిచ్చి...
ఈ లోకం లో నన్ను ఒంటరిని చేసావు!
....."చైతన్య"