Friday 22 June 2012

మదికి చెప్పొదనే ఈ రాజీ!
నువ్వికరావన్న నిజంతో లాలూచీపడి!
........"చైతన్య"

Wednesday 20 June 2012

చిరునవ్వుల నాట్యం!


నీ జ్ఞాపకాల పూదోటలో...
నిత్యం చిరునవ్వుల నాట్యమే నాది!  
....."చైతన్య"
 


మౌనమె నీ బాష!

మౌనానికి కారణాలెతక్కు...
ఎందుకంటే ఆ కారణాల్లో దొరికేది నువ్వే!
........."చైతన్య"


పెదవిటీగలు

మకరందం దాచావా...
పెదవిటీగలు పసిగట్టాయి!
........"చైతన్య"

వాడని పుష్పం..

ఇది నా హృదయం...
నీ జ్ఞాపకాల్లో ఎప్పటికి వాడని పువ్వే!
..........."చైతన్య"

తను..వింటే!

నీ తనువంతా చెవులేనా...
ప్రతి కదలికా వినాలని చేరువౌతుంది!
.........."చైతన్య"

ప్రే...........మ!

మన మధ్య శూన్యాన్ని పూరించేదే.. ప్రేమ!
........"చైతన్య"

దాటలేకే!

మాటల్ని మూటకట్టుకో...
మాటిమాటికీ అడ్డు తగుల్తున్నాయ్!
......."చైతన్య"

రుతురాగాలు...

రెప్పల మాటున మబ్బుల్ని...
నీటిఊటతో నింపుతూ, నువ్ లేక!
....."వంశీధర్ రెడ్డి"





Saturday 2 June 2012

కొంచెముండు!

అప్పుడే విడవమనకు...
నూరేళ్ళ సంతోషాన్ని నే హత్తుకుంది!
....."చైతన్య"

కన్నీటి ప్రశ్నలు!

కన్నీరంటే కోపమే!
కన్నీటి ప్రశ్నలకు సమాధానాల్లేవుగా...
....."చైతన్య"

ఒంటరిగా వదలవుగా!

ఒంటరిగా ఉన్నాగా...
రెక్కలు కట్టుకొస్తాయి రంగుల జ్ఞాపకాలు!!
....."చైతన్య"

ఒంటరితనాన్న కోరింది!


ఓ ఆశను నా చేతికిచ్చి...
ఈ లోకం లో నన్ను ఒంటరిని చేసావు!
....."చైతన్య"

మారవా!

నువ్విచ్చిన ప్రేమ గులాబీలో...
ఒక్కో రెక్కని తుంచేలా చేస్తున్నావ్!!!
....."చైతన్య"

కావల్సిందే!


సంతోషాన్ని పోగొట్టుకున్నా...
సందేహాల ప్రేమ ప్రయాణంలో!!!
....."చైతన్య"

కలే....శాపం!

ఒకప్పటి నా కలే....శాపం!
నా గుండెల్లోంచి దూసుకెల్లిన శరమది!
....."చైతన్య"

కష్టాల కుటుంబం!

కష్టం ఎన్ని కన్నీటి-
బొట్లను కన్నదో!...ఆపుదామన్నా ఆగట్లేదు!
....."చైతన్య"

మమా!

"నా విరహాగ్ని కి
నీ జ్ఞాపకాల ఆజ్యం పోస్తున్నావు"
....."చంద్రశేఖర్ కంచి"

గుర్తొచ్చానా!


"ఒక అస్పష్టపు రాగమేదో
ఆరిన దీపం పొగలా నన్ను నిలదీస్తోంది"
....."అరుణ్ రాజం"