Wednesday 22 February 2012

Top Ten Femtos (23 FEB 2012)


పిచ్చిమనసు!

పాపం ఎవరిదో ఈ మనసు!
తీసుకున్నట్లే తీసుకొని పడేసారు...
....."చైతన్య"

Tuesday 21 February 2012

అందుకేనేమో...

ఇక్కడ మనుషుల్లేరు! మనసులే కనబడుతున్నాయ్...
ప్రేమలోకం కాబోలు!!!
....."
చైతన్య"

షరత్తు!

నే....కోల్పోయిన సంతోషం తిరిగొస్తానంది!
మళ్ళీ నువ్వు నా జీవితంలోకి వచ్చాకనే నన్న షరత్తుతో...
........"
చైతన్య"

నాకొద్దుపో...

పదిలంగా చూసుకుంటావని ఇచ్చా...
కానీ మనసంతా చిందరవందరే!!!

...."చైతన్య"

Monday 20 February 2012

బ్రతికే ఉన్నానా!!!

నమ్మకద్రోహం,నయవంచన..
చంపేసావ్?
బ్రతికుండగానే!

......."చైతన్య"

రెప్పపాటు ప్రేమ!

నీకోసం యుగాలు వేచాను...
ప్చ్.. క్షణాలలోనే నను దాటెల్లిపోయావు!!!
....."చైతన్య"

Saturday 11 February 2012

నిరీక్షణ

నాన్నిచ్చే  డైరీకి...
ఏడాది  ఎదురుచూపు?
........"చైతన్య"

ఎవరిదిది?

రాత మారిందేంటి!
ఎవరిదీ డైరీ?
....."చైతన్య"

మార్పులేదు!

చేజిక్కిన నీ తలవెంట్రుక...
నా డైరీలో మెరుస్తూనేవుంది!
......"చైతన్య"

 

Friday 10 February 2012

జ్ఞాపకాల పూదోట!

డైరీలో పరిమళాలు!!!
వాడిపోని  జ్ఞాపకాలవి...
......"చైతన్య"

నిను చూస్తూనేవున్నా....


కానరాని నిన్ను!
డైరీలో చూస్తున్నా..
......."చైతన్య"

Silence Please...


గుండె పగిలింది.. 
నిశ్శబ్దంగానే...
....."నరేష్ కుమార్"

Thursday 9 February 2012

అవును ఇది నిజం!

నీపై నా ప్రేమను..
తొలిసారి చెప్పింది  డైరీకే!
......."చైతన్య"

 

C/O

డైరీ నాదే,కానీ
ప్రతిపేజీ నీదే!!
....."చైతన్య"

నువ్వే చెప్పు?

ప్రేమ తోటలో దారి
తప్పిపోయా .. !!బయట కెలా వెళ్ళేది ?
....."మెర్సీ మార్గరెట్"

కన్నీటి సిరా


 డైరీ తడిచింది! సిరా కన్నీరు..
......."చైతన్య"

పోతే పోనీ!

డైరీ పోతేనేం?
జ్ఞాపకాలు హృదయంలో..
 ......"చైతన్య"

పదిలపరిచా ...


యవ్వనం పదిలం!
డైరీ పేజీలలో... 

 ......."చైతన్య"

WoW

నీలోని మార్పు...
రామాయణాన్ని రాయించిందా!!
..............."చైతన్య"

వీడ్కోలు




ఎంతగానో అనుకున్నా మరచిపోదామని..
కానీ అది నా అంతమే!!!
........"నీలిమా మాకినేని"





అమ్మ ప్రేమ..


సగం జీవితం అమ్మ వంటింట్లో..
నేను తింటే.. 
తన కడుపు నిండుతుందట!
........"రాంబాబు యేరాజన"

వదిలేస్తున్నా...ఎగిరిపో!


కన్నీటితో నీ దారిని 
శుభ్రం చేశా...నిర్భయంగా వెళ్ళు ...
........."మెర్సీ మార్గరెట్"

Wednesday 8 February 2012

వచ్చేసిందోచ్...

ప్రయత్నం లేకుండా వచ్చేది.. 
వృద్ధాప్యం మాత్రమే!!
........."అరుణ రేఖ కూచిభొట్ల"

అదంతే...

కొన్ని జ్ఞాపకాలను, 
గోడకు వేలాడదీయలేను...
......"కుమార్ వర్మ కయనికొరొత్తు"

హమ్మయా!

నన్నొదిలి, 
ఒంటరైంది ప్రపంచం...
........."వంశీధర్ రెడ్డి"

నోరూరుతుంది!








ఎంతందం నీది,...
ఆకలేస్తుందెంత తిన్నా....



..........."వంశీధర్ రెడ్డి"

అదెలా?

నేన్లేకుండా బ్రతకనన్నావ్?
నేన్లేక చాలాకాలమైందే!
..........."వంశీధర్ రెడ్డి"

ఇంతలోనే...




ముద్దిచ్చేవాడ్నే కాదు,
చేదు మిగులుస్తుందని తెలిస్తే!
........."వంశీధర్ రెడ్డి"

దొరుకుతుందా?












నువ్వు...
నీ చిరునవ్వే లేని చోటే కావాలి!
............."నీలిమా మాకినేని"

ఇది కూడా యూనివర్సిటీనే !






పేదరికం విశ్వవిద్యాలయం...
బాధలకు డిగ్రీలిస్తుంది!!
............"చైతన్య"

చెరిగిపోవులే!












కన్నీరు సుడిగుండం అయినా...
అందులో నీ జ్ఞాపకాలు మాత్రం పదిలం!

........."నీలిమా మాకినేని"





అందుకేనేమో!




అరుంధతి దర్శనం.... 
మున్ముందు జీవితం అంతా...
బ్రాంతినే అనే సూచన!

.........."శ్లోకా శాస్త్రి"




నిజమేనా!













నెలవంక నేలవంక, 
నువ్వేనా పిలిచింది....

............"వంశీధర్ రెడ్డి"

NOYES









ఎక్కడ కలుద్దాం?
విడిపోయిన దగ్గరేనా..

............"వంశీధర్ రెడ్డి"








చెప్పవా ప్లీజ్!






నా జ్ఞాపకాల మైలురాళ్ళ పై
నీ ముఖ చిత్రమేల ??

................"మెర్సీ మార్గరెట్"

ఏం?











గుండెకు పై నీ పేరు తగిలించావ్ ...
కానీ నువ్వు లేవే ??

................"మెర్సీ మార్గరెట్"

నీ....వే.....










నా కళ్ళకి నువ్వు గుర్తొచ్చి
మాట్లాడం మొదలెట్టాయ్..
అందుకే గోడవైపుకు తిరిగా ...

................"మెర్సీ మార్గరెట్"

ప్రేమకు స్వాగతం




ఆశల పొద్దు పొడిచింది
నిన్నే తూరుపుగా చేసుకొని ..


................"మెర్సీ మార్గరెట్"




ఎందుకలా?





నిన్ను మరిచిపోవాలనే.. 
భావనకే మరుపొచ్చింది, 
కానీ నీ జ్ఞాపకాలకు రాలేదేమిట!
 ......................."పద్మ​ శ్రీరాం"

Tuesday 7 February 2012

తిరోగమనం!

             
                          గుహల్లొంచి గృహాల్లొకొచ్చాం... మృగాలు గానే!
                                     ...................."నరేష్ కుమార్"

ఓ స్త్రీ రేపు రా!!!




కాన్వెంటు ముందేడుస్తోంది....
ఎవరో తెలుగు తల్లిట....!

...................."నరేష్ కుమార్ "

జీవశ్చవం





జీవశ్చవం అంటే అర్దం కాలేదు,
నిన్ననే అద్దం లో చూసా... నువ్వు వెళ్ళిపోయాక....!

...................."నరేష్ కుమార్"

మీరైనా చూసారా?






జనాల మధ్యే తిరుగుతున్నా
 ఒక్క మనిషైనా కనిపిస్తాడని.....!


...................."
నరేష్ కుమార్"


నేటి జీవనం







నేటి జీవనం :
వలువలు బరువు
విలువలు కరువు



......................."ప్రకాష్ మల్లవోలు"